18-05-2025 11:14:39 PM
పంట పొలాల్లో అక్రమంగా నిల్వ
పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు దాడి
25 టేకు దుంగలు స్వాధీనం
కామారెడ్డి,(విజయక్రాంతి): అక్రమంగా నిలువ ఉంచిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వారిని మండలం జాగోర గ్రామ శివారులో పంట పొలాల్లో ఆక్రమంగా నిలువ ఉంచిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు పంట పొలంలో 25 టేకు దుంగలను దాచి ఉంచారని సమాచారం మేరకు దాడులు నిర్వహించి అటవీశాఖ ఎఫ్ఆర్ఓ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అదే గ్రామంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఇంట్లో లారీకి పైగా టేకు కలప దాచి ఉంచినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ విషయం అటవీశాఖ అధికారులు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాకోర, జలాల్పూర్, లక్ష్మాపూర్ పైడిమల్లి తదితర గ్రామాల్లో అటవీ ప్రాంతం పక్కనే ఉండడంతో టేకు దొంగలు పెద్ద ఎత్తున నరికివేసి ఇండ్లలో బావుల వద్ద నిలువ ఉంచి రాత్రి వేళలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విషయాలపై అటవి ఆదికారులకు విన్నవించిన కూడా పట్టించుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి లక్షల విలువ టేకు కల్పన స్మగ్లర్లు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధుల అండతో తరలిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. రక్షించాల్సిన అటవీశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల పెద్ద ఎత్తున అటవీలోని టేకు కలప చోరికి గురవుతున్నట్లు సానికులు తెలిపారు.
ఇప్పటికైనా వారిని మండలంలోని బడాపాడు బడా పహాడ్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో టేకు కల్ప భారీగా డంపు చేసి రాత్రి వేళలో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీశాఖ అధికారులు కొందరు మామూలు మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగాధర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు ఫారెస్ట్ బీట్ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు. అక్రమ టేకు కలప రవాణాపై ఫారెస్ట్ బీట్ అధికారి రమేష్ రెడ్డిని విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని సమాచారం వస్తే వెంటనే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆక్రమ కలపను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న 25 టేకు దుoగలు సుమారు లక్ష రూపాయల విలువ కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. అక్రమంగా కలపను ఆటవి నుంచి చోరీకి పాల్పడితే అటవీశాఖ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.