calender_icon.png 17 September, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

17-09-2025 01:42:29 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా(Sri Potti Sriramulu Nellore)లోని సంగం మండలం పెరమన వద్ద ఇసుక టిప్పర్ రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి కారును ఢీకొంది. ఈ దుర్ఘటనలో టిప్పర్ కిందకు కారు చోచ్చుకొనిపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. కారు నెల్లూరు నుంచి కడప వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.