17-09-2025 01:08:04 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన(Telangana Liberation Day) దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మాట్లాడుతూ... ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు పల్లెలపై పడి దోచుకున్నారని వివరించారు. రజాకార్లు గ్రామాలపై పడి హత్యలు, అత్యాచారాలు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చినరోజు ఎందుకు జాతీయజెండా ఎగరవేయడం లేదు?, కర్నాటక, మహారాష్ట్రలో ముక్తి దివస్ జరుపుతుంటే.. ఇక్కడేందుకు చేయడం లేదు? అని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేర్లు మార్చి కాంగ్రెస్, బీఆర్ఎస్ వేడుకలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్ కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారు.. మజ్లిస్ కు భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ కు వంగివంగి సలాం చేసే పార్టీలకు ప్రజలు బుద్ధి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు.