17-09-2025 01:47:36 PM
హైదరాబాద్: నగరంలో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ(Real Estate Company) బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఎండీ శ్రీకాంత్(Krithika Infra Developers MD Srikanth arrested) ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరిట మోసం చేసిన కేసులో శ్రీకాంత్ ను అదుపులోకి తీసున్నామని పోలీసులు చెబుతున్నారు. మూడు ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందు క్యూ కడుతున్నారు.