calender_icon.png 17 September, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'స్వస్త్ నారీ సశక్త్ పరివార్'.. మహిళలకు గొప్ప వరం

17-09-2025 01:20:12 PM

మధ్యప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) బుధవారం మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో పర్యటించారు. జన్మదినం సందర్భంగా 'స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ ఎంతో ధైర్యసాహసాలు చూపించి దేశంలో విలీనం చేశారని, నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని, దేశాన్ని ఐక్యం చేసేందుకు హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నామని తెలిపారు.

దేశభివృద్దిలో మహిళలు, యువకులు పాత్ర ఎనలేనిదని.. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరమని అన్నారు. ఈ పథకం మధ్యప్రదేశ్ లోని  వివిధ వర్గాలకు చాలా ఉపయోగపడుతుందని.. ఈ పథకం వల్ల చేనేత కార్మికులు ఎంతో లబ్ది పొందుతారని పేర్కొన్నారు. పీఎం మిత్ర పార్కుతో రైతులు పలు విధాలుగా ప్రయోజనం పొందుతారని.. పీఎం మిత్ర పార్కు వల్ల వేలమంది యువతకు ఉద్యోగాలు వస్తాయని మోదీ తెలిపారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని.. మహిళా సాధికారత కోసమే ఈ పథకం తెచ్చామని అన్నారు. మహిళలు, యువతుల కోసమే స్వస్త్ నారీ సశక్త్ పరివార్ పథకం తెచ్చామని.. ప్రమాదకరమైనా వ్యాధుల నుంచి మహిళలను రక్షించాలని అన్నారు. క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధుల నుంచి మహిళలను కాపాడాలని.. విశ్వకర్మ జయంతి రోజు మంచి కార్యక్రమం ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు.