calender_icon.png 17 September, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామస్తుని హత్య చేసిన మావోయిస్టులు

17-09-2025 01:27:27 PM

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా నీలావాయ గ్రామానికి చెందిన బండి కొర్రం అనే గ్రామస్థుడిని మావోయిస్టలు బుధవారం ఉదయం ఇన్ ఫార్మర్ నేపంతో హత్య చేశారు. ఈ ఘటనతో అటవీ గ్రామంలో నివసిస్తున్న కుటుంబీకుల అరణ్యరోధనతో మృతుడి వద్ద కన్నీరు పెట్టారు. నాలుగు సంవత్సరాల క్రితం అతని కుమారుడు హరేంద్ర కొర్రం కూడా మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యాడు. అరన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.