16-11-2025 12:53:59 AM
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): విన్ గ్రూప్ ఆసియా సీఈవో ఫామ్ సాన్ చౌ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు విన్ గ్రూప్ సంస్థ ఆసక్తి చూపించిన్నట్లుగా సీఎంతో సీఈవో తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల కు సంబంధించి ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ఆసక్తి చూపించారు.
భారత్ ఫ్యూచర్ సిటీపై సీఈవో ప్రత్యేక ఆసక్తిని కనబరచడంతోపాటు, దాని అభివృద్ధిలో పెట్టుబ డులు పెట్టడానికి విన్‌గ్రూప్ సీఈవో సంసిద్ధతను తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం లో డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడానికి విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ, విన్ గ్రూప్ చైర్మన్ ఫామ్ నాట్ వూంగ్‌లను సీఎం ఆహ్వానించారు. సమావేశంలో అధికారులు సంజయ్ కుమార్, అజిత్ రెడ్డి, గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.