calender_icon.png 15 September, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూత్ స్థాయిలో విజయమే 'గులాబీ' పార్టీ గెలుపుకు బాట

14-09-2025 09:45:17 PM

పెన్ పహాడ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

పెన్ పహాడ్: ప్రతి బూత్‌లో విజయం సాధిస్తేనే ఎన్నికల్లో గెలుపు మనదే అవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం రాత్రి పెన్ పహాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి 'బీఆర్ఎస్ ' పార్టీ ముఖ్య కార్యకర్తలు - బూత్ స్థాయి సమావేశంలో  ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కార్యకర్తలే 'గులాబీ' పార్టీ విజయానికి అస్త్రశస్త్రాలని.. మీ శ్రమే 'బీఆర్ఎస్' పార్టీ అభ్యర్థులు గెలుపు అంటూ.. ఎమ్మెల్యే కార్యకర్తలను ఉత్సాహపరిచారు. గ్రామ స్థాయిలో ప్రతి ఓటర్ని వ్యక్తిగతంగా కలుసుకుని పార్టీ బలం పెంపొందించాలని సూచించారు.

ఎన్నికలు యుద్ధంలాంటివని.. ప్రతి కార్యకర్త సైనికుడిలా శ్రమించాలని.. ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తదేని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు బూత్ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడమే కాకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు విస్తృతం చేయాలని పిలుపు నిచ్చారు.