calender_icon.png 15 September, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాఘవాపూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

14-09-2025 09:42:17 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సాయంత్రం జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. తరగతిలోకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు. భోజనం రుచికరంగా ఉన్నాయా, హాస్టల్ వసతి సౌకర్యంగా ఉందా అని అడగ్గా బాగానే ఉందని తెలిపారు. బాగా చదువుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వంట గదిలోకి వెళ్ళి సిబ్బందితో మాట్లాడుతూ.. వండిన ఆహారాన్ని పరిశీలించి మెనూ ప్రకారం రుచికరంగా వండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అన్ని రిజిస్టర్ లు వెరిఫై చేశారు.