14-09-2025 09:36:10 PM
భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ చేయడం నా జన్మజన్మల పుణ్యఫలం
కమాన్ పూర్ మార్కేట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు చైర్మన్
మంథని,(విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాని, సమ సమానత్వమే ఎజెండాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ చేయడం నా జన్మజన్మల పుణ్యఫలమని, కమాన్ పూర్ మార్కేట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు అన్నారు. మండలంలోని పెంచికల పేట చౌరస్తాలో ఆదివారం సాయంత్రం అయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైనల రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని, ఆయన కృషితో భారతదేశం ప్రపంచంలోనే ఇప్పుడు ముందంజలో కొనసాగుతుందన్నారు.