14-09-2025 09:53:15 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): భక్తుల ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా జరుగుతున్న అయ్యప్ప స్వామి పెద్ద పాదయాత్రకు సంబంధించి హాల్టింగ్, బుకింగ్స్ పై ఏర్పాట్లు చేపట్టినట్లు గూరుస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గూరుస్వాములు: సోములు యాదవ్ గూరుస్వామి, బుచిబాబు గూరుస్వామి, బాలూ యాదవ్ గూరుస్వామి, నాగరాజు గూరుస్వామి, బాబులు గౌడ్ గూరు స్వామి. యాత్రలో పాల్గొనే భక్తులకు విశ్రాంతి, భోజనం, రాత్రి హాల్టింగ్, వాహనాల బుకింగ్, తాత్కాలిక నివాసం వంటి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సమగ్ర ప్రణాళికను గూరుస్వాములు సమీక్షించారు.
భక్తుల ఆధ్యాత్మికతకు ఎటువంటి అంతరాయం కలగకుండా, పాదయాత్ర విజయవంతంగా కొనసాగేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. గురుస్వాములు మాట్లాడుతూ... “అయ్యప్ప స్వామి భక్తులందరూ భక్తిశ్రద్ధలతో యాత్ర కొనసాగించాలి. సౌకర్యవంతమైన వసతి, వాహన బుకింగ్స్, తినుబండారాలు అన్నీ అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇది కేవలం యాత్ర కాదు, అయ్యప్పుని సన్నిధి చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణం” అని పేర్కొన్నారు.