calender_icon.png 28 November, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు కస్టడీకి ఐ-బొమ్మ రవి

28-11-2025 12:00:00 AM

  1. మూడు రోజుల పాటు సైబర్ క్రైమ్ విచారణ
  2. చంచల్‌గూడ జైలు నుంచి స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): ఐ-బొమ్మ వెబ్‌సైట్ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో గురువారం నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రవిని చంచల్‌గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తంలో రవిని పోలీసులు 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించి నప్పటికీ.. ఆర్థికపరమైన అంశాల్లో మాత్రం స్పష్టత రాలేదు. ముఖ్యంగా రవికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు, నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి సమాచారం లభించలేదు. ఈ క్రమంలోనే బ్యాంకు లావా దేవీల గుట్టు విప్పేందుకు పోలీసులు మళ్లీ కస్టడీ కోరారు.

ఈ మూడు రోజుల విచారణలో రవి వెనుక ఉన్న నెట్‌వర్క్, సాంకేతిక సహకారం అందించిన వారి వివరాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. గత విచారణలో దాచిపెట్టిన అంశాలను, దొరకని బ్యాంకు ఖాతాల వివరాలను రాబట్టడ మే లక్ష్యంగా సైబర్ క్రైమ్ పోలీసులు తమ విచారణను కొనసాగించనున్నారు.