28-11-2025 12:00:00 AM
ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి): గాంధీభవన్‌లో నిర్వహించే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వచ్చిన దరఖాస్తుల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ సమస్యలు, భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రేషన్‌కార్డులు, నగరంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నారు.