calender_icon.png 1 November, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షపు నీరు ఆగకుండా వెంటనే చర్యలు

30-10-2025 01:30:40 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు  అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వాతావరణ శాఖ జిల్లా కి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. జిల్లా లోని పలు ప్రాంతాలను బుధవారం కలెక్టర్  క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. హన్మకొండ - హైదరాబాద్ హై వే మార్గం లో గల రఘునాథ్ పల్లి  బ్రిడ్జి  వద్ద  వర్షపు నీరు ను పరిశీలించి..

వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని.. ఆగకుండా తగు చర్యలు తీసుకోని... రవాణా పరం గా ఇబ్బంది కలగకుండా చూడాలని.. పోలీస్, రెవిన్యూ, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగె  జనగాం పట్టణం లో  ఎక్కడ కుడా వర్షపు నీరు ఆగకుండా... ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగుచర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్  ని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, తహసీల్దార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.