calender_icon.png 30 October, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట నష్టం జరగకుండా చూడాలి

30-10-2025 01:29:47 AM

  1. కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి
  2. ఎస్డీఆర్‌ఎప్, ఎన్డీఆర్‌ఎఫ్ సమన్వయంతో పనిచేయాలి
  3. సీఎంరేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో పంట నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తుఫాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆరా తీశారు. తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉండ టం.. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖ ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉం డాలని ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, గుండ్రా తిమడుగు స్టేషన్‌లో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేయాలని చెప్పారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సమన్వయం చేసుకోవాలని, కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.

నీటి పారుదల శాఖ అధికా రులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పు డు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. తుఫాన్ ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు.