calender_icon.png 26 July, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దే బాధ్యత నేటి విద్యార్థులదే

25-07-2025 11:51:58 PM

ప్రముఖ పర్యావరణ వేత్త కొల్లు లక్ష్మీనారాయణ

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం  ప్లాస్టిక్ వాడడం వల్ల  జీవరాసులపై వాటి ప్రభావం ఎలా పడుతుందో అనేటువంటి అంశంపై పిల్లలకు డిబేట్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ వేత్త కొల్లు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.... ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దే బాధ్యత విద్యార్థులదే అని అన్నారు. ప్లాస్టిక్ వాడడం వల్ల మానవ మనుగడపై జీవరాసులపై వాటి ప్రభావం పడుతుందని ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రతి విద్యార్థి వారి కుటుంబంలో వారి కుటుంబ సభ్యులతో ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేయాలని అన్నారు.