29-08-2025 10:28:37 PM
నకిరేకల్,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మండల ఎమ్మెస్ఓ సతీష్, ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ కోరారు. శుక్రవారం కట్టంగూర్ ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహన్ని ఆకస్మికంగా పరిశీలించారు. హాస్టల్ లో విద్యార్థలకు ప్రతి రోజు అందుతున్న మెను అందిన నోటు పుస్తకాలు, యూనిఫాo గురించి విద్యార్దులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులకు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని విద్యార్దులకు అందించాలని సిబ్బoదికి సూచించారు.