calender_icon.png 30 August, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేకరీ కార్మికుడు కాసు అజయ్ ని ప్రతిమ ఆస్పత్రిలో పరమర్శించిన ప్రజాసంఘాల నాయకులు

29-08-2025 10:24:07 PM

అజయ్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి

ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకుల డిమాండ్

మంథని,(విజయక్రాంతి): మంథని పాత పెట్రోల్ బంక్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వీట్ హౌస్ లో పనిచేస్తూ బేకరీ యజమాని ఇంటి నిర్మాణ పనిలో తీవ్రంగా గాయపడిన బిట్టుపల్లి  గ్రామ యువకుడు కాసు అజయ్ ని శుక్రవారం కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అర్ల సందీప్, గొర్రెంకల సురేష్  పరామర్శించారు. అనంతరం అజయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బిట్టుపల్లి గ్రామానికి చెందిన అజయ్ గత వారం రోజుల క్రితం బేకరి యజమాని బిల్డింగ్ రెండవ అంతస్తు పై నుండి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడని, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగి వెన్నుముక దెబ్బ తినడం వల్ల యువకుడు మంచానికే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని నాయకులు అన్నారు. కావున చికిత్స పొందుతున్న అజయ్ కి మెరుగైన వైద్యం అందించడంలో యజమాని సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.