25-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి) : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక బీఆర్‌ఎస్ సమన్వయకర్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. ఇం దులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయక ర్తల ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారు. ఎన్నికల సరళిని, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నివేదించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సమ న్వయకర్తల పూర్తి జాబితాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం అధికారికంగా విడుదల చేశారు. మున్సిపల్ ఎ న్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపేలక్ష్యంగా శ్రేణు లు పనిచేయాలని కేటీఆర్ కోరారు.