calender_icon.png 25 January, 2026 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై ‘జాగృతి’ పోటీ

25-01-2026 12:00:00 AM

మున్సిపల్ బరిలోకి కవిత?

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి) : పురపాలక ఎన్నికల్లో పోటీ చేయా లని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోయినా ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్ర త్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. రాజకీయ పార్టీ గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. కానీ, పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అంతకుముందే వచ్చే అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్‌బీ)కు చెందిన ‘సింహం’ గుర్తుతో పోటీ చేయాలని తెలంగా ణ జాగృతి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి గుర్తు కోసం ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకత్వంతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు చర్చ సాగుతోంది. ఈ దశలోనే ప్రజల్లోకి వెళ్లి, క్యాడర్‌ను బలోపేతం చేసుకోవాలని తెలంగాణ జాగృతి భావిస్తోంది. గెలుపు కన్నా పార్టీ ఉనికిని నమోదు చేయడంనే మొదటి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. తెలంగాణ జాగృతి నిర్ణయం ప్రాంతీయ పార్టీలకు ఓటు చీలికకు దారి తీసే అవకాశముంది.