25-01-2026 12:00:00 AM
నాగర్‌కర్నూల్, జనవరి 24 (విజయక్రాంతి): గుంపు మేస్త్రి వెట్టిచాకిరి చెర నుంచి 30 మంది వలస కార్మికులను అధికారులు విముక్తి చేసి శనివారం సొంత గ్రామాలకు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి, ఉయ్యాలవాడ, ఇటిక్యాల, పెద్దము ద్దునూరు, బొందలపల్లి, వెన్నచర్ల, కోడేరు, నల్లవల్లి, తెలకపల్లి, లింగాల, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన కార్మికులను గుంపు మేస్త్రిల చెర నుంచి అధికారులు విడిపించా రు.
పది నెలల క్రితం వెన్నచర్ల, వనపర్తి, గుడిపల్లి ప్రాంతాలకు చెందిన పెద్ద కృష్ణ య్య, ఎర్రన్న, పెంటయ్య అనే గుంపు మేస్త్రి లు కార్మికులను మహారాష్ట్రలోని పార్థినీ జిల్లా దేవగానిపట్టాకు తీసుకెళ్లి ఆర్సీబీ కన్స్ట్రక్షన్స్ సంస్థలో వెట్టిచాకిరి చేయించారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలపర్స్ సంస్థ చొరవ తీసుకుని రెస్క్యూ చేపట్టిం ది.
సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యా దు చేయగా, అధికారుల సమన్వయంతో కార్మికులను కాంట్రాక్టర్లు గుంపు మేస్త్రీల చెర నుంచి విడిపించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వివరాలు సేకరించి, పోలీసు బందో బస్తుతో వారి స్వగ్రామాలకు తరలించారు.