calender_icon.png 24 January, 2026 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా రోడ్డు భద్రతపై అవగాహన

24-01-2026 12:00:00 AM

‘అరైవ్ -అలైవ్’ అవగాహనలో గోదావరిఖని 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి

గోదావరిఖని, జనవరి23 (విజయ క్రాంతి) రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సురక్షితమైన ప్ర యాణం, వాహనదారుల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అరైవ్ లైవ్‘ కార్యక్రమంలో భాగంగా, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావరిఖని 1- టౌన్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లు రమేష్, అనూష, మనోహ ర్ లు విస్తృత స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గోదావరిఖని లోని తిలక్ నగర్, రమేష్ నగర్, టాక్సీ అడ్డా, డిసిఎం అడ్డా, రద్దీ ప్రదేశాలలో పోలీస్ అధికారు లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ మాట్లాడుతూ.., ‘అరైవ్ అలైవ్‘ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. ప్రతి వాహనదారుడు. తప్పనిసరిగా హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, సేఫ్ అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్దతులు అనుపరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లు తదితర ఫోర్ వీలర్ వాహనాలు నడిపే వారు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే ప్రతి వాహనదారుడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే ధ్రువవత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో సంబంధిత పోలీస్ అధికారు లు, వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.