24-01-2026 12:00:00 AM
తప్పిన భారీ ప్రమాదం
రాజాపూర్ జనవరి 23: మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం షాట్ సర్క్యూట్ తో పంక్షర్ షాప్ దగ్ధం సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాకరజాల ఆంజనేయులు మధ్యాహ్నం తన షాప్ లో భార్య కుమారుడిని పెట్టి బయటికి వెళ్ళాడు. విద్యుత్ షాక్ తో షాప్ లో ఒక్కసారి మంటలు చెలరేగి షాప్ లో టైర్లు అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.అక్కడే ఉన్న అతని భార్య చంటి బిడ్డను తీసుకోని బయటికి పరుగులు తీయడంతో పెనుప్రమాదం తప్పింది.
స్థానికులు అగ్నిమాపాక సిబ్బందికి సమాచారం ఇవ్వడం తో వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.ఈ అగ్ని ప్రమాదం లో షాపు పూర్తిగా దగ్ధం కావడం తో దాదాపు రూ. 3.50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.