22-05-2025 11:13:39 PM
ప్రారంభించిన ప్రముఖ యాంకర్ సుమ..
అందరికీ అందుబాటు ధరలో వస్త్రాలు : ప్రొప్రయిటర్ నరసింహ..
ఎల్బీనగర్: వనస్థలిపురం గణేశ్‌టెంపుల్ రోడ్డులో ప్రముఖ సామాజిక వేత్త, ఆధ్యాత్మిక వేత్త ప్రొప్రయిటర్ నర్సింహ ఆధ్వర్యంలో ‘కటాక్ష సిల్క్స్' వస్త్ర నిలయాన్ని గురువారం ప్రముఖ యాంకర్ సుమ(Anchor Suma Kanakala) ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ... విభిన్నమైన వెరైటీలతో కటాక్ష సిలక్స్ అందించే చీరలు ప్రజల మనసును ఆకర్షిస్తుందని అభిప్రాయపడ్డారు. నిత్యం ప్రజలకు అందుబాటు ధరలో ఆకర్షణీయమైన వస్త్ర నిలయంగా కటాక్ష సిలక్స్ నిలువబోతుందని ఆకాంక్షించారు. ప్రొప్రైటర్ నర్సింహ మాట్లాడుతూ... ‘ఇది హైదరాబాద్‌లో మా మొదటి బ్రాంచ్ అని.. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువవుతాం. వినియోగదారుల ఆశీర్వాదంతో నగరంలో అనేక బ్రాంచీలు ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొని అభినందనలు తెలిపారని నరసింహ పేర్కొన్నారు.