03-02-2026 02:01:15 AM
గట్టు ఫిబ్రవరి 2 : క్రీడల్లో గెలుపు, ఓటమిలను సమానంగా చూడాలని బిఆర్ యస్ పార్టీ గద్వాల నియోజక వర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని గట్టు మండలం తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ మారెమ్మ అవ్వ దేవర మహో త్సవాలకు ముఖ్యఅతిథిగా హనుమంతు హాజరయ్యా రు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు కబడ్డీ టోర్నమెంట్ జెర్సీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణ వల్ల యువకుల మధ్య స్నేహబంధం పెరగడంతో పాటు, ఆటల పట్ల పట్టుదల పెరుగుతోందని అన్నా రు.గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడా కారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రదర్శనలు చేయాలని, భవిష్యత్తులో క్రీడా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి గ ద్వాల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూ చించారు. విద్యతో పాటు క్రీడ నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మద్దిలేటి,మోనేష్, చక్రధర్ రెడ్డి,శేఖర్ నాయు డు, శ్రీరాములు, రజినీబాబు, నరేష్ ,తిమ్మప్ప,నరసింహులు,గోవిందు, తదితరులు పాల్గొన్నారు.