26-10-2025 12:00:00 AM
ఉక్కు మహిళ సనాయె
జపాన్ పురుషాధిక్య రాజకీయాలను తిరగ రాసి, ఆ దేశపు తొలి మహిళా ప్రధానిగా అధికార పీఠాన్ని అధీష్ఠించారు సనాయె తకాయిచి. పట్టు విడువకుండా పోటీ చేస్తూ ప్రయత్నం చేసి మూడో ప్రయత్నంలో పదవిని కైవసం చేసుకున్నారు. ‘పట్టు పట్టరాదు.. పట్టి విడువరాదు’ అన్న సంకల్పంతో ఎదిగారు.
అందుకే ఆమె ఉక్కు మహిళ !
స్మృతి రికార్డుల మోత
మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస సెంచరీలతో చెలరేగిపోతోంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మంధాన సూపర్ సెంచరీతో మెరిసింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్ మహిళా క్రికెటర్ మెగ్ లాన్నింగ్ రికార్డును సమం చేసింది. మంధాన మూడు ఫార్మాట్లలో కలిపి 17 శతకాలు బాదింది.