calender_icon.png 29 October, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా మహా నరసింహ హోమం

26-10-2025 12:00:00 AM

ఘనంగా గర్భాలయ యంత్ర స్థాపన పూజ 

* హాజరైన మంత్రి దామోదర రాజ నరసింహ, అక్షయపాత్ర ఫౌండేషన్

సత్య గౌర చంద్రదాస ప్రభూజీ తదితర ప్రముఖులు 

* సంగారెడ్డి జిల్లా కందిలో హరేకృష్ణ కల్చరల్ కేంద్రంలో నిర్వహణ

సంగారెడ్డి, విజయక్రాంతి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలో కందిలో శనివారం హరే కృష్ణ మూమెంట్ ఇండియా  ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్‌లో మహానరసింహ హో మం, గర్భాలయ యంత్ర స్థాపన పూజ వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుకకు హరే కృష్ణ మూమెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు అండ్ ప్రాంతీయ అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) సత్య గౌర చంద్రదాస ప్రభూజీ అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర,సాంకేతిక శాఖల మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకపూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరేకృష్ణ మహా మంత్ర జప యజ్ఞంతో ప్రారంభమైన ఈ వేడుకలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.

వైదిక మంత్రోచ్ఛారణల నడుమ మహా నరసింహ హోమం అంత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దామోదర రాజనరసింహ పూర్ణా హుతి సమర్పించగా, అనంతరం గర్భాలయ యంత్ర స్థాపనపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ విగ్రహాలు ప్రతిష్ఠంచే గర్భాలయంలో పవిత్ర విఘ్న వినాశక యంత్రం స్థాపించారు. అనంతరం హారతి, భజనలు, పుష్పాంజలి కార్యక్రమాలతో వేడుక ముగిసింది. ఈ సందర్భంగా ప్రతిపాదిత ఆలయ నిర్మాణ నమూనా, సౌకర్యాల ప్రదర్శన (ఎగ్జిబిషన్) ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు తిలకించి అభినందించారు.

శిలాఫలకం ఆవిష్కరణను దామో దర రాజనరసింహ, సత్య గౌర చంద్రదాస ప్రభూజీ, ఇతర ప్రముఖులు సంయుక్తంగా నిర్వహించారు. అలాగే అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధునిక వంటగదులను అతిథులు సందర్శించి, స్నాక్ తయారీ యూనిట్, ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్ అండ్ కట్టింగ్ మెషీన్లను ప్రారంభించారు. హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి అభినందించారు.

2001లో విద్యార్థుల ఆకలితీర్చేందుకు ప్రారంభమైన అక్షయ పాత్ర సంస్థ, ప్రస్తుతం 25 లక్షల మంది ప్రభుత్వ పిల్లలకు దేశవ్యాప్తంగా మధ్యా హ్నం భోజనం అందిస్తుండటం ఆషామాషీ విషయం కాదన్నారు. గొప్ప సంకల్పం, సమాజానికి సేవచేయాలన్న ఆకాంక్ష ఉంటే నే ఇది సాధ్యమని ప్రశంసించారు. తెలంగాణలో సామాజిక, సేవాకార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నటువంటి సత్య గౌర చంద్రదాస ప్రభూజీకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

హరేకృష్ణ మూవ్ మెంట్ సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సత్య గౌర చంద్రదాస ప్రభూజీ తన ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజ నరసింహ అక్షయపాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ మూమెంట్ పట్ల చూపుతున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. విశిష్ట అతిథిగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్టీఏ అధికారి వెంకటరమణ, డీఎస్పీ సత్తయ్య, ఆర్డీఓ రాజశేఖర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

హరే కృష్ణ మూమెంట్ గూర్చి

హరే కృష్ణ మూమెంట్, హైదరాబాద్ (హెచ్‌కేఎం) ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థగా, సనాతన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మానవతా విలువలను సంరక్షిస్తూ, వీటిని ప్రజల్లో ఆచరణలోకి తేవడానికి కృషి చేస్తోం ది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ, ఇప్పటివరకు 15 కోట్లకు పైగా భోజనాలను అందించింది.

భోజనామృతం, ఇందిరమ్మ క్యాంటీన్లు, సద్దిమూట, స్వాస్థ్య ఆహార వంటి పథకాల ద్వారా రోజూ 200 కంటే ఎక్కువ కేంద్రాల నుంచి వేలాది మందికి సేవలు అందిస్తుంది. వివరాలకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, హరే కృష్ణ కల్చరల్ సెంటర్, 9640086664, 9396416341 నంబర్లలో సంప్రదించవచ్చు.