25-01-2026 12:27:26 AM
షేక్ హసీనా ఆక్రందన
షేక్ హసీనా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి ఆమె. గతేడాది ఆ దేశంలో చోటుచేసుకున్న ఉద్రిక్తల నడుమ ఆమె భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె తాజాగా ఓ సంచలన ఆడియో సందేశం విడుదల చేశారు. బంగ్లా ఎన్నికల్లో తన పార్టీని పోటీ చేయకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ సంగతి ఏ కంచికి చేరుతుందో వేచిచూడాల్సిందే.
ఫాంలోకి సూర్యాభాయ్!
30 ఏళ్ల వయసులో కాస్త ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన సూర్యాభాయ్.. టీ20 ఫార్మాట్‌లో అనతి కాలంలోనే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. వరుసగా 2022 23 సంవత్సరాలకు ‘ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే.. ఏడాది నుంచి అతని బ్యాటింగ్ పేలవంగా ఉంది. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో తన బ్యాట్‌ను ఝుళిపించాడు. హాఫ్ సెంచరీ చేసి కాస్త గాడినపడ్డాడు.