25-01-2026 12:24:58 AM
పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ సభ్యుల ముఖ్య సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మాట్లాడుతూ.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటుగా వివిధ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు.
కత్తెర గుర్తు తో పోటీ చేయాలని చూస్తున్న ఆశావహులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయాలు కేవలం డబ్బుతోనే శీనడుస్తున్నాయని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చును చక్రవడ్డితో సహా సంపాదించుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేసేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేసారు.
అభ్యర్థులు జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ 8008484689 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు పాకాల దినకర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దాస్యపు దీపక్, ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.