calender_icon.png 28 December, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్శకత్వం వైపు..

28-12-2025 12:52:00 AM

సినీ పరిశ్రమలో నటులు డైరెక్టర్లుగా మారిన సందర్భాలెన్నో! కానీ, అందాల భామలు దర్శకత్వంపై మనసు పడటం చాలా అరుదు. ఔను, హీరోయిన్ షగ్న శ్రీ వేణున్ మెగాఫోన్ పట్టనుంది. ఫ్యాషన్ డిజైనింగ్ నేపథ్యం నుంచి సినిమాల్లోకి వచ్చిన షగ్నశ్రీ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది. ఇప్పుడు దర్శకురాలిగా మారిన ఈ యువ కథానాయకి తొలి సినిమాను ప్రకటించింది. ఎస్2ఎస్ సినిమాస్ బ్యానర్‌పై మనసును హత్తుకునే ప్రేమథతో ఈ సినిమా రూపొందనుంది.

వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న షగ్న శ్రీ వేణున్‌నే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాను 2026 వేసవిలో రిలీజ్ చేసేలా టీమ్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.  పోస్టర్‌ను గమనిస్తే.. బ్లాక్‌డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుస్తోంది. దీన్నిబట్టి ఇది ముక్కోణ ప్రేమకథ అని అర్థమవుతోంది. మరి హీరోయిన్‌గా మెప్పించిన షగ్న శ్రీ వేణున్ డైరెక్టర్‌గానూ సినీప్రియుల మనసు గెలుచుకుంటుందా.. లేదా తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.