14-08-2025 01:41:36 AM
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హత ఎన్నేళ్లు
త్వరలో క్యాబినెట్ ముందుకు పంచాయతీరాజ్ చట్టం ప్రస్తావన
నోటిఫికేషన్‌కు ముందే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు
బీసీల 42% రిజర్వేషన్ అమలవుతే... పోటీలో మరింత మంది
భారీగా పెరగనున్నఆశావాహులు
వనపర్తి, ఆగస్టు 13 ( విజయక్రాంతి ) : : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఇందుకోసం రేవంత్ సర్కార్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో అధికారులు ఎన్నికల సామాగ్రి, ఓటర్ లిస్టులు, ఇబ్బందితో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి నిర్వహించే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తెరమీదకు వస్తోంది. ఆశావాహుల్లో ఎక్కువశాతం ముగ్గురు పిల్లల నిబంధన ఆశానిపాతంగా మారింది.
అయి తే ఇద్దరు పిల్లల నిబంధన కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సంచలనాత్మకమైన నిర్ణయా నికి శ్రీకారం చుట్టునుంది. ఎన్నికల ముందే అధిక సంతానం పోటికి నిషేధం అనే నిబంధనను తొలగించనుంది.
ఇందుకోసం పం చాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్21(3) తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచినట్లు విశ్వసనీయత సమాచారం. ఇప్పటికే ఆసక్తికరంగా బీసీ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మా ర్పు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతుంది.
గొడ్డలి పెట్టుగా 1995 చట్టం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలు ఉండడంతో పోటీదారులు నిరాశకు గురవుతున్నారు. పోటీ బరిలో నిలిచేవారికి 1995 లో చేసిన పంచాయతీరాజ్ చట్టం గొడ్డలి పెట్టుగా మారింది. చట్టానికి సవరించాలని గతంలో ప్రభుత్వాలకు విన్నవించినప్పటికీ ఎలాంటి చోరవ తీసుకోలేదు. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా గెలిచిన వారిపై ఓడిన వాళ్ళు కోర్టుకు వెళ్లడం పరిపాటిగా మారింది.
కుటుంబ నియంత్రణ చర్యలు భాగంగా 1994/95 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ( సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, పురపాలక) ఎన్నికల పోటీకి అనర్హులుని అప్పటి ప్రభు త్వం చట్టం చేసింది. గత మూడు దశాబ్దాలుగా ఈ నిబంధన కొనసాగుతోంది.
ఒకరికి న్యాయం.. మరికొందరికి అన్యాయమా
ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసే నేతలకు 1995 చట్టంతో సంబంధం లేకుండా పోయింది. వారికి ఎంత మంది పిల్లలు ఉన్నా అవకాశం కల్పిస్తారు. చట్టాలు సైతం చేస్తారు. కానీ గ్రామస్థాయిలో పోటీ చేస్తే సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసిలకు అవకాశం కల్పించక పోవడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వారికి ఒక న్యాయం.. క్రింది స్థాయి వారికి మరో న్యాయమా అనేది సర్వత్ర చర్చ నడుస్తోంది.
ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఆశవాహులకు మొండి చేయి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సి ఎం కెసిఆర్ కు 1995 పం చాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ చట్టంలో పంచాయతీల్లో , మున్సిపాలిటీల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హతలు అనే చట్టం చెబుతోంది. అయితే 2019లో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ చట్టాన్ని సవరణ చేసి ఇద్దరు పిల్లలు అనే నిబంధనను సవరించింది.
దీంతో పోటీ చేసే వారికి ఊరట నిచ్చింది. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి మాత్రం నిబంధనలను సవరించలేకపోయింది. ఈసారి రేవంత్ సర్కార్ లోనైనా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన క్యాబినెట్లో చర్చించి ఆశావాహులకు ఊరట కలిగిస్తారని అభిప్రాయపడుతున్నారు.