calender_icon.png 18 August, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో డబ్బు, పరపతి కంటే విద్య శాశ్వతం

14-08-2025 01:39:16 AM

నారాయణపేట.ఆగస్టు 13(విజయక్రాంతి) ; జీవితంలో డబ్బు, పరపతి ఏదీ శా శ్వతం కాదని, మనం చదివిన చదువే ( విద్యే ) శాశ్వతమని నారాయణపేట ఎమ్మెల్యే డా క్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అన్నారు. డబ్బు వ స్తుంది.. పోతుందని కానీ నేర్చుకున్న విద్య మాత్రం మనతోనే చివరి దాకా ఉంటుందని ఆమె తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి తరానికి వారసులు అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి కష్టపడి చదువుకుని కని పెంచిన తల్లిదండ్రులు, చదువు నేర్పించిన గురువులు, ఉన్న ఊరికి మంచి పేరు తీసుకు రావాలని ఆమె సూచించారు.

నారాయణపేట, మహబూబ్ నగర్ సత్య సా యి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్ లో బుధవారం కళాశాల విద్యార్థుల కు వ్యక్తిత్వ వికాసం, నిస్వార్థ సేవ అనే అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అరుదు అని, ఇలాంటి కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లని ఆమె సూచించారు. యూత్ ఇస్ ఫ్యూచ ర్ ఆఫ్ ది కంట్రీ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు రావ డం తనకు ఆనందంగా ఉందన్నారు. జనా భా నిష్పత్తిలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందన్నారు.

విద్యార్థి దశలో ఏం జరిగినా వా రిదే బాధ్యత అన్నారు. మన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. విద్యార్థులు టీనేజ్ ను ఒక పరిమితి లో ఎంజాయ్ చేయాలని, హద్దు దాట వద్దని ఆమె సూచించారు. వి ద్యార్హత ను బట్టి ఉద్యోగాలు వస్తాయని, అ లా అని ఉద్యోగమే జీవితం కాదని, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయన్నారు.

తాను ఎ మ్మెల్యే గా గెలిచిన తర్వాతనే పీజీ పూర్తి చేశానని, ఎమ్మెల్యే అయ్యానని చదువు ను వదిలి పెట్ట లేదన్నారు. ఎమ్మెల్యే అయిన కొత్తలో చాలా మంది నేను( ఎమ్మెల్యే ) హైదరాబా ద్ లోనే ఉంటుందని కామెంట్ చేశారని, కానీ పరీక్షల సమయంలో మాత్రమే హైదరాబాద్ లో ఉన్నానని, మిగతా రోజుల్లో ప్ర జా సేవలోనే నిమగ్నమయ్యానని తెలిపారు. గత నవంబర్ లో పరీక్షల కోసం చదివితే ఒ క్క ముక్క అర్థం కాలేదని, పుస్తకం తీస్తే నే ఒక రకమైన భయం తనను వెంటాడిందని అయినా అలాగే ఏడుస్తూ.. నవ్వుతూ చదివాను అని ఎమ్మెల్యే చెప్పారు.

ఎమ్మెల్యేగా ఉన్నా ... ఏమైనా చేయవచ్చు అని తాను అనుకోలేదన్నారు. అయితే జీవితంలో ఇప్ప టి దాకా ఏ పరీక్ష లో ఫెయిల్ కాలేదని, కానీ ఎమ్మెల్యే అయ్యాక రాసిన పీజీ పరీక్షలో కేవ లం 5 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యానని, మళ్ళీ మే నెలలో పరీక్ష రాసి జూన్ లో పాస్ అయ్యాను అని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెన్నైకి చెందిన శౌర్య చక్ర అ వార్డు గ్రహీత వెంబు శంకర్, ముంబై కి చెం దిన ప్రముఖ గాయకుడు సాయిరాం అ య్యర్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, నారాయణపేట సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్య క్షుడు చిట్టెం మాధవ రెడ్డి, మహబూబ్ నగర్ సత్య సాయి సేవా సమితి అధ్యక్షుడు, ఆ సేవా సమితి మిగతా సభ్యులుపాల్గొన్నారు.