calender_icon.png 20 September, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గండ్ర దంపతులపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

20-09-2025 07:32:58 PM

- బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్

చిట్యాల,(విజయక్రాంతి): అధికారం పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గండ్ర దంపతులపై అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని  బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్,మాజీ జెడ్పీటిసి గొర్రె సాగర్ అన్నారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన సతీమణి గండ్ర జ్యోతిలపై టేకుమట్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను,టేకుమట్ల బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ శనివారం చిట్యాల మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అక్రమ ఇసుక రవాణా అదుపు చేయవలసిన నాయకులే అడ్డగోలుగా ఇతర జిల్లాలకు ఇసుకను తరలిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల నాయకులు ఇసుకను తరలిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్రులైన గండ్ర దంపతుల పైన బురద జల్లే రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ ఇసుక రవాణా అని అరికట్టాలని,లేదంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.