calender_icon.png 20 September, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాండర్డ్ డైజేషన్ సమావేశానికి ముందే లాభాలు ప్రకటించాలి

20-09-2025 07:34:09 PM

మందమర్రి (విజయక్రాంతి): కోలిండియాలో సెప్టెంబర్ 22న జెబిసిసిఐ స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తుండగా, ఈ సమావేశానికి ముందే సింగరేణి యాజమాన్యం గత ఆర్థిక సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి, వేజ్ బోర్డు సభ్యుడు మంద నరసింహారావు, ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్, ఎస్సిఈయు(సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షుడు సాంబారు వెంకటస్వామిలు డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో ఈనెల 22న జరగనున్న స్టాండర్ డైజేషన్ సమావేశంలో పిఎల్ఆర్ బోనస్ కు సంబంధించిన చర్చ జరగనుండగా, ఈ సమావేశంలో కోల్ ఇండియా, సింగరేణికి సంబంధించిన లాభాలు తెలియజేసిన తరువాతనే బోనస్ పై చర్చ జరుగుతుందన్నారు.

ఇప్పటికే కోల్ ఇండియా యాజమాన్యం లాభాలను ప్రకటించగా, సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు లాభాలను ప్రకటించలేదని వారు మండిపడ్డారు. ఈ సమావేశానికి ముందే సింగరేణి సాధించిన లాభాలను యాజమాన్యం ప్రకటించాల్సిన అవసరం ఉందని, అలా ప్రకటించకుండా ఈ సమావేశంలో హాజరు కావడం సరైనది కాదన్నారు. సింగరేణి యాజమాన్యం సమావేశానికి ముందే సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను తెలుపాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలోని అన్ని యూనియన్లు డిమాండ్ చేసిన మేరకు దసరా సెలవు మార్పుపై యాజమాన్యం స్పందించాలన్నారు.