calender_icon.png 20 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ పాఠశాలలో విద్యార్థి నాయకుల ఎంపిక కార్యక్రమం

20-09-2025 07:31:16 PM

హాజరైన మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ 

బాల్కొండ (విజయక్రాంతి): విద్యార్థి దశలో ఉన్నప్పుడే మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని బాల్కొండ విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జరిగిన విద్యార్థి నాయకుల ఎంపిక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఎన్నికల ద్వారా నాయకులోగా ఎన్నుకోవడం అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం విద్యార్థి నాయకులుగా ఎన్నికైన 10వ తరగతి విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదర్శ పాఠశాల విద్యార్థుల యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పాటు అందిస్తున్న ప్రిన్సిపల్  శ్రీనివాస ప్రసాద్ ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల వయసు ప్రిన్సిపాల్ గణేష్ పిఆర్టియు మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు మురళి గోపి విజయలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 

ఆదర్శ పాఠశాలలో తిథి భోజనం

ఆదర్శ పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకంలో తిథి భోజనం అందించబడింది.  ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తిథి భోజనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రాజ్ ఏర్పాటు చేసిన తిథి భోజనం విద్యార్థులు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు తిథి భోజనాన్ని అందించిన శ్రీనివాస్ రాజుని ప్రత్యేకంగా అభినందించారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, దత్తు, గణేష్, రవి పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాలలో అలరించిన బతుకమ్మ సంబరాలు

మండల కేంద్రంలోని బాల్కొండ ఆదర్శ పాఠశాలలో విద్యార్థినిలు బతుకమ్మ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన బతుకమ్మలతో పాఠశాల ఆవరణలో ఆడుతూ పాడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో పువ్వులను పూజించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. బతుకమ్మకు గల చారిత్రాత్మకమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.