calender_icon.png 21 May, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్య అభివృద్ధి శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంపు

21-05-2025 12:00:00 AM

- త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సర్వే నిర్వహణ

- సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్  ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

మంథని మే-20 (విజయ క్రాంతి): వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా ఉ పాధి అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.మంగళవారం  రామగుండం-3, అ డ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని ఎం.వి.టి.సి నందు సింగరేణి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం)ను రాష్ట్ర మంత్రి  శ్రీధర్ బాబు ,జిల్లా కలెక్టర్ కో య శ్రీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్క న్ సింగ్ రాజ్ ఠాగూర్,  స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ, రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర్ రావు లతో కలిసి  ప్రారంభించారు.

ఈ సం దర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడు తూ సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతీ యువకులలో వృత్తి నైపుణ్యత పెంచి, ఉపా ధి అవకాశాలు కల్పించడం కోసం వివిధ ఏరియాలలో ఇలాంటి శిక్షణా కేంద్రాలు ని ర్వహిస్తుందన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా సుమారు 38 కో ర్సులలో  నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వబడుతుందని, అలాంటి శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషకరమని,నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు.

శిక్షణ పొందే అభ్య ర్థులు సర్టిఫికెట్ కోసమే కాకుండా, పూర్తిస్థాయిలో శిక్షణ పొంది నిజమైన నైపుణ్యాన్ని సాధించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏ ర్పాటు చేసిందని,రాష్ట్రంలో త్వరలో స్కిల్ స ర్వే నిర్వహించి, నిరుద్యోగులకు వివిధ విభాగాలలో ఉన్నటువంటి నైపుణ్యత ఆధారంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రా న్ని ఒక కళాశాలగా అభివృద్ధి చేసి, ఇక్కడి నుండే నియామకాలు చేపట్టే విధంగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్. డి.ఓ. సురేష్, హెచ్.ఆర్.డి. విభాగం జనరల్ మేనేజర్ గుంజపడుగు రఘుపతి, రామగుండం-1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్, ప్రాతినిధ్య సంఘ నాయకులు కో ట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్ర ధాన కార్యదర్శి పి.నరసింహులు, ఎస్వోటుజిఎం బి.వి.సత్యనారాయణ, వివిధ గనుల, విభాగాల అధిపతులు, అధికారులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, చొప్పరి సదానందం, కొమురయ్య గౌడ్,  ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.