21-05-2025 12:00:00 AM
- రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
వేములవాడ, మే 20 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల్లో విజయం సాధించేలా కాం గ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం వేములవాడ హరిహర గార్డెన్ లో వేములవాడ ని యోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఎఐసిసి సెక్రటరీ గతంలో ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షురాలిగా, పార్లమెంట్ స భ్యులుగా ఇప్పుడు తెలంగాణ ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ క్షేత్ర స్థాయిలో పార్టీ స్థానిక సంస్థల్లో కూడా విజయం సాధించాలని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎవరైతే గ్రామ కాంగ్రెస్ పార్టీని నడపగలుగుతారో వారే గ్రామ అధ్యక్షుడు గా ఎన్నుకోవాలని, మండల అధ్యక్షులు గా సమష్టిగా నిర్ణయం తీసుకోవాలని తెలిపా రు.మీ అందరి కృషి శ్రమ తో తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమా లు ప్రతి ఇంటికి తీసుకుపోయి అన్ని ఎన్నికల్లో పార్టీ గెలిచేలా బాధ్యత మీదని మంత్రి తెలిపారు. భక్తుల మనోభావాలు మేరకే ఆల య అభివృద్ధి జరుగుతుందని, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మండలాలు, గ్రామాల్లో పార్టీ పునఃనిర్మా ణం జరగాలని, అనుబంధ సంఘాలు , యు వజన సంఘాలు బలోపేతం కావాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, వే ములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పీసీసీ పరి శీలకులు పక్రుద్దిన్, కృష్ణా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.
రాజన్న సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల మే20.( విజయ క్రాంతి ) దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం మం త్రి పొన్నం ప్రభాకర్,స్థానిక ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్,కలెక్టర్ సందీప్ కు మార్ ఝా,రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాల యం చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. కలసి స్వామివారిని దర్శించుకొనేందుకు ఆ లయంలోకి చేరుకున్న వీరికి ఆలయ అర్చకు లు స్వస్తి వేద మంత్రాలతో స్వాగతం పలికినారు,స్వామివారిని దర్శనానంతరం అర్చకు లు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేయగా ఈవో వినోద్ శేష వస్త్రాలు కప్పి లడ్డు ప్రసాదాలు.అందజేశారు.తర్వాత ఆలయ ఆవరణలో వేములవాడ నుంచి ముంబై వెళ్లేందుకు రెండు ఏసీ ఆర్టీసీ బస్సు లు ప్రారంభించారు.
వేములవాడ టు ముంబై బస్సులో ప్రారంభించిన మంత్రి పొన్నం
వేములవాడ, మే 20 (విజయ క్రాంతి): వేములవాడ నుండి ముంబై వరకు రెండు ఆర్టీసీ లహరి ఏసీ బస్సులను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ నెల రోజుల క్రితం ముంబయి వెళ్లి అక్కడి తెలు గు వారితో సమావేశమయ్యారని తెలిపారు. అక్కడ నుండి బస్సు ఏర్పాటు చేస్తే బాగుంటదని వారు నాకు ఆయనకు దృష్టికి తీసు కెళ్తే అక్కడి నుండే ఆయన ఫోన్ చేసి వేములవాడ నుండి ముంబై కి బస్సు కావాలని కోరారని అన్నారు.
వేములవాడ చందుర్తి ,రుద్రంగి , కోరుట్ల ,మెట్పల్లి, వర్ని ముంబై వరకు ఈ బస్సు ప్రయాణం చేయనుందని తెలిపారు. ముంబై లో ఉన్న.. ఎక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు మా బిడ్డలే వారికి ప్రయా ణం ఇబ్బంది కలగవద్దని అక్కడి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసు కున్నామన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నాలు కొ నసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణ గౌడ్ , ఆర్టీసీ ఆర్‌ఎం, తదితరులు పాల్గొన్నారు.