calender_icon.png 15 August, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

15-08-2025 05:48:51 PM

ఘనంగా పంద్రాగస్టు వేడుకలు 

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడ వాడల మువ్వన్నెల జెండాను ఎగరవేసి జండా వందనం సమర్పించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యఅతిథి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్,  కాంగ్రెస్ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యాలయంలో అధ్యక్షురాలు మాలోత్ కవిత, వ్యవసాయ మార్కెట్ లో చైర్మన్ సుధాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

కేసముద్రంలో..

కేసముద్రం పట్టణంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మున్సిపాలిటీ లో కమిషనర్ ప్రసన్న రాణి, తహసిల్ ఆఫీసులో తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో క్రాంతి, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో వెంకన్న, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ యాదగిరి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మురళీధర్ రాజ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అలాగే అంబేద్కర్ సెంటర్, జ్యోతిబాపూలే సెంటర్, పొట్టి శ్రీరాములు సర్కిల్, గాంధీ సెంటర్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు.