15-08-2025 05:45:56 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం.సూర్య ప్రకాష్ జ్యూవెల్లెర్స్ గోల్డ్ & సిల్వర్ మర్చంట్ & వర్క్ షాప్ ను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి యువ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా M సూర్య ప్రకాష్ జ్యూవెల్లెర్స్ గోల్డ్ & సిల్వర్ మర్చంట్ యజమాని సూర్య ప్రకాష్ తో పాటు వారి కుమారులు శ్రీకాంత్, అరుణ్, శశికాంత్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఇంత పెద్ద బంగారం షో రూమ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పోచారం అన్నారు.