06-02-2026 01:23:39 AM
ఆపిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా పెండల మల్లేష్ ముదిరాజ్ విజ్ఞప్తి
గడ్డపోతారం ౧౧వ వార్డులో అభ్యర్థికి ప్రజల నీరాజనం
జిన్నారం/అమీన్ పూర్ ఫిబ్రవరి 5(విజయక్రాంతి): గడ్డపోతారం మున్సిపల్ ఎన్ని కల ప్రచారంలో భాగంగా గురువారం 11వ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పెండల మల్లేష్ ముదిరాజ్, మిత్రబృందం, యువకులతో వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శించి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ, రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మాదారం, దువ్వగుంట గ్రామాల ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని, ఈ వైఫల్యాలను ప్రజలంతా గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లేశ్ ముదిరాజ్ ను ఆపిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో లింగం, రామ కృష్ణ, కుమార్, శేఖర్, ఎల్లయ్య, జగన్, వెంకటేష్, దశరథ్, దేవేందర్, రాజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.