calender_icon.png 6 February, 2026 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో ‘ఆశా డే’

06-02-2026 01:24:10 AM

వెంకటాపురం(నూగూరు)ఫిబ్రవరి 5(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం మండలం,ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆశా డే. కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆశా కార్యకర్తల నెలవారి రిపోర్టును పరిశీలించడం జరిగింది.

జాతీయ కుష్టి నిర్మూలన కార్యక్రమం,స్పర్శ,కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం గతజనవరి 30తేది నుండి ప్రారంభం కాగా,ఫిబ్రవరి 13వ తేధి వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ములుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్లో, మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, ఎదిర వైద్య అధికారి వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు సమావేశంలో తెలిపారు.