calender_icon.png 22 January, 2026 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు స్పష్టత ఇవ్వండి: పీసీబీ

19-11-2024 12:00:00 AM

లాహోర్: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఎందుకు ఆడదనే దానిపై ఐసీసీ స్పష్టమైన కారణం తెలపాలం టూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పేర్కొంది. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టును పాక్‌కు పంపేది లేదంటూ బీసీసీఐ ఇది వరకే ఐసీసీకి స్పష్టం చేసింది. హైబ్రీడ్ మోడ్ అయితే ఆడేందుకు తాము సిద్ధమని తెలిపింది.

అయితే హైబ్రీడ్ మోడ్‌కు పాక్ ససేమిరా అనడంతో టోర్నీ నిర్వహణ సంధిగ్దంలో పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోవడానికి గల కారణాలను కచ్చితత్వంతో పేర్కొనాలంటూ ఐసీసీకి తెలిపింది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయాయి.