calender_icon.png 25 January, 2026 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వ గురుగా భారత్

25-01-2026 12:13:28 AM

  1. నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం 
  2. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

మేడ్చల్, జనవరి 24 (విజయ క్రాంతి): విశ్వగురు స్థానంలో భారత దేశాన్ని నిలపాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని హకీంపేట్ లో గల నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటి అకాడమీ అథారిటిలో రోజ్‌గార్ మేళా కార్యక్రమం కింద నియమితులైన యువతకు నియామక పత్రాలను అందించే కార్యక్రమంలో ఎన్‌ఐఎస్‌ఎ డైరెక్టర్ డీపీ పరిహార్, డిప్యూటి డైరెక్టర్ అనీల్ దాములతో కలిసి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ వేదిక ఒక భరోసా, భవిష్యత్తులో ఉద్యో గం కల్పింస్తుందనడానికి ఎలాంటి సందే హాం లేదన్నారు. భారత ప్రభుత్వం ప్రతి సం వత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని అన్నారు. నిరుద్యోగ యువత కష్టపడి చదవి ఉద్యోగం సంపాదించాలని సూచించారు.

ఉద్యోగ ప్రక్రియలో ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేదన్నారు.కొత్తగా నియమితులైన ఉద్యోగులకు సూచనలు చేస్తూ, కేవలం జీతం కోసం కాకుండా దేశం, సమాజ సేవకు అంకితభావంతో పని చేయాలని బండి సంజయ్ కుమార్ కోరారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, ఆ లక్ష్య సాధనలో కొత్త ఉద్యోగులు నిరంతర భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

ఉద్యోగమే సాధించాలనే ధృక్పథంతో కాకుండా, ఉపాధి సృష్టికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాన మంత్రి సంకల్పానికి అనుగుణంగా, రోజ్‌గార్ మేళా ఈ దృక్పథాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే ముఖ్య మైన కార్యక్రమంగా నిలుస్తోందన్నారు.దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 61 వేల మంది కొత్తగా నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందించే ఉద్దేశంతో 18వ రోజ్‌గార్ మేళాను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎస్‌ఏ లో మొత్తం 238 మంది అభ్యర్థులు నియామక పత్రాలు స్వీకరించారు.ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా రోజ్‌గార్ మేళాలను ఉద్దేశించి ప్రసంగించారు.