calender_icon.png 22 December, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్ 19 ఆసియాకప్ ఫైనల్లో భారత్ ఓటమి

22-12-2025 12:00:00 AM

దుబాయి, డిసెంబర్ 21 : అండర్ 19 ఆసియాకప్ ఫైనల్లో భారత్‌కు చుక్కెదురైంది. ఫైనల్లో పాక్ చేతిలో పరాజయం పాలైంది. లీగ్ స్టేజ్ నుంచీ అదరగొట్టిన భారత యువ జట్టు టైటిల్ పోరులో మాత్రం చతికిలపడింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో  పూర్తి గా నిరాశపరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ అండర్ 19 జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ భారత బౌ లర్లపై ఆధిపత్యం కనబరుస్తూ కేవలం 113 బంతుల్లోనే 172(17 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులు చేశాడు.

అతనితో పాటు అహ్మద్ హు స్సేన్ 56, ఉస్మాన్ ఖాన్ 35 పరుగులతో రా ణించారు. దేవేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు తీశా డు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చేతులెత్తేసింది. వైభవ్ సూర్యవంశీ 10 బం తుల్లో 26 రన్స్ చేసి ఔటవగా.. కెప్టెన్ ఆ యుశ్ మాత్రే(2), ఆరోన్ జార్జ్ (16), వేదాం త్ (9), కుందు(13) విఫలమయ్యారు. ప్రధా న బ్యా టర్లలో ఏ ఒక్కరూ రాణించకపోవడంతో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగుల కే ఆలౌటైంది. దీంతో గ్రూపు దశలో భారత్ చేతిలో ఎదురైన ఘోరపరాభవానికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.