22-12-2025 12:00:00 AM
హైదరాబాద్ , డిసెంబర్ 21 : హైదరాబాద్‌లో మరో క్రికెట్ లీగ్ ప్రారంభమైంది. ప్రముఖ సంస్థ ఈబీజీ గ్రూప్ టాలీవుడ్ ప్రో లీగ్‌కు శ్రీకారం చుట్టింది. దిగ్గజ క్రికెటర్లు కపిల్‌దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా హెచ్ ఐసీసీ వేదికగా దీనిని ఆవిష్కరించారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు టీపీఎల్‌కు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్‌లో సెలబ్రిటీలు ప్లేయర్స్‌గా, నిర్మాతలు ఫ్రాంచై జీ ఓనర్లుగా ఈ లీగ్‌ను రూపొందించారు.
ఆరు ఫ్రాంచైజీలు పోటీపడే లీగ్‌ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇండియాలో క్రికెట్, సినిమా కలయికకు ఎంతో క్రేజ్ ఉందని, ఈ లీగ్ విజయవంతమవ్వాలని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆకాం క్షించారు. టాలీవుడ్‌లోనూ మంచి క్రికెటర్లున్నారనీ, వారంతా ఈ లీగ్‌లో తమ మెరుపు లు మెరిపించాలని సెహ్వాగ్, రైనా ఆల్ ది బెస్ట్ చెప్పారు. క్రికెట్‌తో పాటు వినోద కార్యక్రమాలు, ఫ్యాన్ జోన్లు, డిజిటల్ కంటెంట్ల తో భారీ ఎత్తున దీనిని నిర్వహిస్తున్నట్టు ఈ బీజీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ చె ప్పారు.
కాగా టీపీఎల్ అనేది టాలీవుడ్ ఐక్య తే లక్ష్యంగా తీసుకొచ్చినట్టు నిర్మాత దిల్ రాజు చెప్పారు. సినిమా కోసం పనిచేసే ప్రతీవిభాగంలోని వ్యక్తలంతా కలిసిమెలిసి ఉం డాలన్నదే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అలయ్ భలయ్ సంస్కృతే దీనికి స్ఫూర్తిగా చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ప్రో లీగ్‌తో ఒక బెంచ్ మా ర్క్‌ను స్థాపించబోతున్నట్టు వెల్లడించారు.