calender_icon.png 23 December, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్-న్యూజిలాండ్ మధ్య ఎఫ్‌టీఏ

23-12-2025 12:00:00 AM

  1. ఫోన్‌లో ఇరు దేశాధినేతల సంభాషణ
  2. ఒప్పందంపై ప్రకటన
  3. విద్యార్థులు, వృత్తినిపుణులకు న్యూజిలాండ్ ఆఫర్స్
  4. వచ్చే 15 ఏళ్లలో ఆ దేశం 20౦ బిలియన్ల మేర పెట్టుబడులు

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౨: భారత్ - న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ టెలిఫోన్ ద్వారా సంభాషించుకుని ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు అధికారిక ప్రకటన చేశారు. తొమ్మిది నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ చర్చలు సఫలం కావడం విశేషం. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవ్వడమే కాకుండా, ఆ దేశం వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమైంది.

భారత్ నుంచి గతంలో కంటే భారీగా ఎగుమతులు పెరగనున్నాయి. తమ దేశంలోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో భారత్ నుంచి ఈ దేశానికి భారీగా వస్త్రాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు భారీ లబ్ధి చేకూరుతుంది. అలాగే భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులు ఇకపై న్యూజి లాండ్‌లోనే చదువుకుని.. తర్వాత అక్కడే ఉద్యోగం చేసుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు వచ్చింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజి నీరింగ్, మ్యాథ్స్ విద్యార్థులకు ౩- ౪ ఏళ్ల పరిమితితో వీసా లభిస్తుంది.

ఐటీ, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ వంటి రంగాల నిపు ణులకూ యేటా 5,000 తాత్కాలిక ఉపాధి వీసాలు కేటాయిస్తుంది. ఒప్పందంలో మరో విశేషమేమిటంటే.. ఇది పూర్తిగా మహిళల నేతృత్వంలో సాగిన తొలి ఒప్పందం. రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమైన నాటి నుంచి రెండు దేశాల తరఫున మహిళా అధికారులే కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ ఒప్పందం అంతర్జాతీయంగా  ప్రత్యేకతను సంతరించుకున్నది.