19-09-2025 12:00:00 AM
సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులకు హైదరాబాద్ కు చెందిన ఈ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎం ఏ బైగ్, శ్రీనివాస్ భోజనం ప్లేట్స్,నోట్ బుక్స్, పెన్నులు, ఆట వస్తువులు, డిక్షనరీ తదితర సామాగ్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృభాషతో పాటు నేటి సమాజంలో ఇంగ్లీష్ సబ్జెక్టుపై పట్టు అవసరమని భవిష్యత్తులో ఉద్యోగాలకు ఇంగ్లీష్ తప్పనిసరి అయ్యిందని దానిపై పట్టు పెంచుకుని విద్యార్థులు అనర్గళంగా మాట్లాడడానికి కృషి చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి మాట్లాడుతూ స్కూల్ పిల్లల చదువుకు అవసరమైన స్టేషనరీ సామాగ్రి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సివియర్ డిసేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ కత్తుల మాట్లాడుతూ ఉన్న ఊరిని కన్నతల్లిని ఎప్పటికీ మర్చిపోవద్దు అందులో భాగంగా తనవంతు సహాయంగా మన స్కూల్ పిల్లలకి ఎప్పటికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శశికళ, సూపర్వైజర్ నిర్మల, కత్తుల నరసింహ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.