calender_icon.png 18 May, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూఢచర్యం ఆరోపణలతో యూట్యూబర్ అరెస్ట్

18-05-2025 12:55:39 AM

-హర్యానాలో పోలీసుల అదుపులో ఆరుగురు 

-వారిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా

-రెండు నెలల కిందట పాక్‌లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా

-ఐదు రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం

గురుగ్రామ్, మే 17: గూఢచర్యం ఆరోపణలతో శనివారం  పోలీసులు హర్యానాకు చెందిన జ్యోతిమల్హోత్రా అనే యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారు. జ్యోతి రెండు నెలల కిందటే పాక్‌లో పర్యటించింది. పర్యటనకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను కూడా సామాజికమాధ్యమాల్లో పంచు కుంది. దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని మల్హోత్రా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మాధ్యమాల ద్వారా పాక్ ఏజెంట్లతో పంచు కుంటున్నారని పోలీసులు ఆరోపించారు.

‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్న జ్యోతి ‘ట్రావెల్ విత్ జో 1’ పేరుతో ఇన్‌స్టా ఖాతాను కూడా నిర్వహిస్తోంది. ఈ రెండు ఖాతాలను లక్షల్లో ఫాలో అవుతున్నారు. ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఐదుగురు వ్యక్తులను కూడా గూఢచర్యం ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. 

జ్యోతికి పాక్ ఏజెంట్లతో సంబంధాలు

జ్యోతి మల్హోత్రాకు పాక్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టు విచారణ అధికారులు వెల్లడించారు. ‘2023లో కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా సంపాధిం చిన మల్హోత్రా మొదటిసారి పాక్‌ను సందర్శించింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఎహ్సన్ అలియాస్ డానిష్ అనే వ్యక్తిని కలిసింది. వారి మధ్య చాలా తొందరగా స్నేహం బలపడింది. ఎహ్సన్ ఆమెకు పాక్‌లోని నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను పరిచయం చేశాడు.

పాక్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా మల్హోత్రా పాకిస్థానీలతో పరిచయాలు కొనసాగించింది. ఎవరికీ అనుమా నం రాకుండా ఉండేందుకు పాక్‌కు చెందిన వ్య క్తుల కాంటాక్ట్స్‌ను మారు పేర్లతో సేవ్ చేసింది. ఇప్పటి వరకు ఆమె మూడుసార్లు పాక్‌లో పర్యటించింది.’ అని పోలీసులు పేర్కొ న్నారు. జ్యోతిపై బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 152, అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్ 1923లోని సెక్షన్ 3,4,5 కింద కేసు నమోదు చేశారు. 

మరో ఐదుగురు కూడా... 

గూఢచర్యం ఆరోపణల మీద హర్యానాకు చెందిన మరో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వీరందరూ పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. పటియాలాలోని ఖల్సా కళాశాలలో చదువుతున్న దేవేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు. దేవేం ద్ర సింగ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలు పోస్ట్ చేశాడు. వారందరినీ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. యమీన్ మహ్మద్, ఆర్మాన్, గుజాలా, దేవేందర్ సింగ్, జ్యోతి మల్హోత్రా, బాను నస్రీనా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.