15-12-2024 12:21:07 AM
మణిపూర్ బోణీ.. తెలంగాణకు డ్రా
హైదరాబాద్: దేశవాలీ సంతోష్ ట్రోఫీ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 57 సంవత్సరాల తర్వాత సంతోష్ ట్రోఫీకి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ మైదానంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మణిపూర్ 1 సర్వీసెస్‌పై విజయంతో బోణీ కొట్టిం ది. ఇక మధ్యాహ్నం జరిగిన తెలంగాణ, రాజస్థాన్ మ్యాచ్ 1 డ్రాగా ముగిసింది.
అంతకముందు తెలంగాణ, రాజస్థాన్ మ్యాచ్‌ను జెండా ఊపి టోర్నీని ప్రారంభించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆటగాళ్లతో కరచాలనం చేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి మ్యాచ్‌ల్లో కేరళతో గోవా, తమిళనాడుతో మేఘాలయా, ఢిల్లీతో ఒడిశా తలపడనున్నాయి.