calender_icon.png 1 July, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కా పథకం ప్రకారమే లైంగిక దాడి

01-07-2025 02:36:39 AM

లా కాలేజీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి

కోల్‌కతా, జూన్ 30: పశ్చిమ బెంగాల్‌లోని కస్బా లా కాలేజీ విద్యార్థిపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టున ముగ్గురు నిందితులు ముందస్తు పథకం ప్రకారమే న్యా య విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. లైంగిక దాడికి గురైన విద్యార్థినిని కళాశాలలో అడుగుపెట్టిన తొలి రోజే వేధించారన్నారు.

బాధితురాలిపై లైంగిక దాడికి ముందు కూడా ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిందితుల ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా వారి నివాసాల్లో సోదాలు జరిపారు. స్టూడెంట్ యూనియన్ రూమ్, వాష్ రూమ్, గార్డ్స్ రూమ్ నుంచి ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్టు తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎంసీ నేత మనో జిత్ మిశ్రా గతంలోనూ కళాశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా పవర్తించేవాడని తెలుస్తోంది.